రాజకీయ నేపధ్యం:
ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి పరిపాలనపై ఆకర్షితుడై భారతీయ జనతా పార్టీలో చేరారు. చేరిన వెంటనే, శ్రీకాకుళం జిల్లాలో వేలాదిమంది ఆన్లైన్ ద్వారా పార్టీ ప్రాధమిక సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేసి రాష్ట్ర నాయకుల దృష్టిని ఆకర్షించారు. స్వల్పకాలంలోనే అనేక పదవులు పొంది, వాటిని భాధ్యతతో నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా మీడియా కన్వీనరుగా, జిల్లా సోషల్ మీడియా కన్వీనరుగా, జిల్లా డిజిటల్ టీం ఇంచార్జ్ గా, బిజెపి శ్రీకాకుళం నగర అధ్యక్షునిగా, శ్రీకాకుళం అసెంబ్లీ కన్వీనరుగా, బిజెపి ఇ-లైబ్రరీ విభాగం రాష్ట్ర కన్వీనరుగా పలు భాధ్యతలు నిర్వహించారు.
2019 లో జరిగిన సాధారణ ఎన్నికలలో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశారు
ప్రస్తుతం బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా బాధ్యత నిర్వహిస్తున్నారు.
2023 లో సంవాద్ కేంద్ర జిల్లా కన్వీనర్ గా, నరేంద్ర మోడి యాప్ రాష్ట్ర కో-కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు.
2024 లో శ్రీకాకుళం జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనరుగా, జిల్లా సంస్థాగత సహ ఎన్నికల అధికారిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు.
జిల్లాలో, నియోజకవర్గంలో, నగరంలో అనేక ప్రజా సమస్యలను జిల్లా అధికారులు మరియు రాష్ట్ర, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించారు. అనేక కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ప్రక్కదారి పట్టకుండా అడ్డుకున్నారు.
కుటుంబ రాజకీయ నేపధ్యం:
జిల్లాలో పేరుపొందిన మొదటితరం రాజకీయ కుటుంబానికి చెందిన వారు. వీరి తాతగారు లేటు చల్లా నరశహం నాయుడు గారు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్ గా పని చేసారు.
చిన్నాన్న లేటు చల్లా లక్ష్మీనారాయణ గారు రెండు పర్యాయములు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేసారు. ఒకసారి ఇండిపెండెంటుగా, మరొక సారి జనతా పార్టీ నుండి గెలిచారు.
మరొక చిన్నాన్న లేటు చల్లా సత్యనారాయణ మూర్తి (తంబి) కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ గల నాయకుడిగా పేరు పొందారు.
చల్లా వెంకటేశ్వర రావు గురించి:
1 వ తరగతి విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి పట్టణంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో, 2 వ తరగతి నుండి 4 వ తరగతి వరకు తిరుపతి లోని ప్రభుత్వ పాఠశాలలో, 5 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు అనకాపల్లి పట్టణం, గాంధీనగర్ లోని ప్రాధమికోన్నత పాఠశాలలో, 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు అనకాపల్లి పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ లో, ఇంటర్మీడియట్ అనకాపల్లిలోని ఎఎంఎఎల్ కళాశాలలో చదువుకుని, ఎంసెట్ లో 441 ర్యాంక్ తెచ్చుకుని, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనేరింగ్ చదివారు. ఇంజనీరింగ్ అయిన తరువాత తీవ్ర ప్రమాదానికి లోనై అంగవైకల్యం కలిగినా, ఆత్మ విశ్వాసం కోల్పోకుండా, 5 సంవత్సరాలు కంప్యూటర్ శిక్షణ మరియు ప్రభుత్వ కార్యాలయాల కంప్యూటరీకరణ, 20 సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీగా, జిల్లా స్థాయి వ్యాపారం సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బిజెపి పార్టీలో కీలక భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు
సోషల్ మీడియా:
Website:
https://bjpchalla.com
Facebook Page
Facebook Account
http://fb.com/venkuchalla
Twitter
http://x.com/venkuchalla
YouTube
http://youtube.com/bjpchalla
Instagram
http://instagram.com/venkuchalla
LinkedIn
https://www.linkedin.com/in/challa-venkateswara-rao-54033015a
NaMo App:
https://nm-4.com/challa
పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్పందన:
ఈనాడు, ఆంద్రజ్యోతి, ఆంధ్రభూమి మొదలైన పత్రికలలో ప్రచురితమైన పార్టీ కార్యక్రమాల క్లిప్పింగ్స్
YouTube Videos Link
https://youtu.be/y8zLzDxK_vI?si=bBBoRZQObanQovDw
https://youtu.be/9Odv5eeXusg?si=CrqJDRgtoQHVI72K
BJP National Council Member
BJP State Convenor (E-Library)
BJP Srikakulam Assembly
2019 - MLA Contested
Former City President, District Media & Social Media Convenor
BJP Srikakulam District
Andhra Pradesh
8500102030
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
Download PDF